Breaking News

‘స్పోర్ట్స్ ఫర్ చేంజ్’ 6 వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్వాలిఫైర్స్ పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ఆంధ్ర లయోలా కాలేజీలో శనివారము HCL ఫౌండేషన్ మరియు హీల్ చారిటీ వారి ఆధ్వర్యంలో ‘స్పోర్ట్స్ ఫర్ చేంజ్’ 6 వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ క్వాలిఫైర్స్ పోటీలు ఘనంగా జరిగాయి. ఉత్సాహంగా యువ క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించిన ఈ పోటీలలో, కృష్ణా,ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుండి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 730కి పైగా విద్యార్థులుఅనేక క్రీడా పోటీల్లో పోటీ పడ్డారు. హీల్ చారిటీ, తోటపల్లి మరియు HCL ఫౌండేషన్ కలిసి ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌ను ముఖ్య అతిధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు (IAS) ప్రారంభించారు. వారు HCL మరియు HEAL యొక్క ప్రయత్నాలను అభినందించారు. వ్యక్తిగత అభివృద్ధి మరియు ఆరోగ్యకర సమాజం నిర్మాణంలో క్రీడల ప్రాముఖ్యతను కూడా ఉద్ఘాటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా 45000 పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

‘స్పోర్ట్స్ ఫర్ చేంజ్’ 6 వ ఎడిషన్ పోటీలలో 170కి పైగా ప్రతిభావంతులు మరియు జట్లు, జూన్ 2024లో బెంగళూరులో జరగబోయే దక్షిణ జోన్ స్థాయి పోటీలకు ఎంపిక చేయబడ్డారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి HCL ప్రోత్సహకాలు ఉంటాయని HCL ఫౌండేషన్ SFC ఇన్-ఛార్జ్ నందగోపాల్ తెలిపారు.

రేపటి క్రీడా తారలను గుర్తించడంలో మరియు పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు చాల కీలకం. యువ అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించుకొని, క్రీడల్లో తమ కెరీర్‌ను ప్రారంభించుకొనే అవకాశాన్ని ఇవ్వడంలో వీటికి విలువ ఉంది. వీటిని మద్దతు ఇవ్వడం ముఖ్యం, ఎందుకంటే ఇవి పిల్లల్లో జట్టు భావన, క్రమశిక్షణ, మరియు ఓర్పు వంటి విలువలను అలవర్చుతాయని HEAL క్రీడా వాలంటీర్లు తెలిపారు. మన పిల్లలు విద్యలో మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా శ్రేష్ఠతను సాధించే మరిన్ని అవకాశాలను సృష్టించడానికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలు మరియు వాలంటీర్లు ముందుకు రావాలని కోరారు.

మరో అతిధి ఆంధ్ర లయోలా కాలేజీ ప్రిన్సిపాల్ రెవ. ఫాథర్ కిషోర్ మాట్లాడుతూ జోనల్ మరియు నేషనల్ గేమ్స్ వంటి కార్యక్రమాలు తమ కాలేజీకి సెలవులలో జరిగించుకోవటానికి అనుమతిస్తామని తెలిపారు.

HCL Tech విజయవాడ HR Lead S. రాజేష్, HCL ఫౌండేషన్ విజయవాడ ఇన్-ఛార్జ్ బి. శ్రీనివాస్, ఆంధ్ర లయోలా కాలేజీ ప్రిన్సిపాల్ రెవ. ఫాథర్ కిషోర్, HEAL CEO K. Ajaykumar, Dr కిషోర్, సుధాకర్, HEAL క్రీడా వాలంటీర్లు, హీల్ మరియు HCL ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్ర లయోలా కాలేజీ వారికి హీల్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *