Breaking News

రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, తదితర పలు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర సిఎస్ డా. కే.ఎస్ జవహర్ రెడ్డి

-సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది: సిఈఓ ముఖేష్ కుమార్ మీనా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నుండి శనివారం గ్రూప్- 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ పై సూచనలు, పట్టా, డికెటి మరియు ప్రభుత్వ భూములకు సంబంధించి భూ సేకరణ & ఆర్&ఆర్ సమస్యలు, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎ – కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జనన & మరణ నమోదు చట్టంపై సూచనలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించగా, సిఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించగా, తిరుపతి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు..

సిఈఓ మాట్లాడుతూ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ప్రకటించనున్నారు అని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందనీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పక్కాగా అమలు చేయాలనీ దిశా నిర్దేశం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్డీసి మురళి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, డ్వామా పిడి శ్రీనివాస రావు, డిపీఎంఓ శ్రీనివాస రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *