Breaking News

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అవినాష్ పాల్గొని 3,12,14,18 డివిజన్ లకు చెందిన 5 గురికి వైద్య సేవలు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన రూ.5,00,000/- చెక్కులను లబ్ధిదారులకు అందించాను. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్య శ్రీ పధకం ప్రవేశపెట్టడం జరిగింది అని,ఈ పధకం కింద మన రాష్ట్రంలో నే కాకుండా, పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేపించుకోడానికి వీలు కల్పించారు అని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్స కు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్జి పెట్టుకొంటే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ నాలుగు ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులు కి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి అని,కానీ ఇప్పుడు ఎవరికి లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పధకం అమలు జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,14వ డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్,సొంగా రాజ్ కామ పాల్గొన్నారు కలిసి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *