విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల పాలన చేరువ చేసి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మహాత్మా గాంధీ ఆశయసాధన దిశగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం 19వ డివిజన్ బృందావన్ కాలనీ నందు 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే సచివాలయ భవనానికి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ గారు ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనలో సమూల మార్పులు వచ్చాయని, ప్రతి పనికి వందలు ఖర్చు చేసుకుని మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఇళ్ల వద్దే ఉండి వలంటీర్ ల ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారని అన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది , మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలా ప్రజలకు ఉపయోగాపడేలా, చరిత్రలో గుర్తిండిపోయే పని ఒక్కటైన చేసారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు అన్ని గ్రామ స్థాయిలోనే సచివాలయల ద్వారా పరిష్కారం అవుతున్నాయని, దాదాపు 35 శాఖలకు సంబంధించి 600 రకాల సేవలు ఈ సచివాలయల అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహెనా నాహీద్,నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వేంకట సత్యనారాయణ,కో అప్షన్ మెంబెర్ అలీం,మండల అధ్యక్షులు బుర్రి జగజ్జివన్ రావు మరియు కాలనీ పెద్దలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News