Breaking News

వెస్ట్ ఇబ్రహీంపట్నం నందు ప్రార్ధనా కూడిక

-ప్రభువుతో కొద్ది సమయం

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం మండలం స్థానిక వెస్ట్ ఇబ్రహీంపట్నం ఆర్ . సి . యo దేవాలయం నందు సహాయమత విచారణ గురువు బెల్లంకొండ అనిల్ కుమార్ చే మంగళవారం వెస్ట్ ఇబ్రహీంపట్నం దేవాలయం నందు దేవునితో కొంత సమయం ప్రార్థన కూడికను నిర్వహించారు. ఈ ప్రార్థన కూడికలో ఫాదర్ జీవన్ కుమార్ దేవుని సందేశాన్ని వివరించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్ర వారంలో మనము ఉన్నామని, దేవునికి దగ్గరగా జీవించాలని, దేవునితో పాటు జీవించాలని, దేవునిలా జీవించాలని, ఒకరికొకరు సహాయపడుతూ దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవుడికి దగ్గరగా జీవించాలని, మానవాళి పాప రక్షణ అర్ధమై సిలువలో మరణించారని, ఆ సిలువను ధ్యానిస్తూ ప్రతి ఒక్కరు ఈ పవిత్ర వారంలో ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవ్వాలని వాక్య సందేశాన్ని అందించారు. పరిశుద్ధ దివ్యసప్రసాద ఆశీర్వాదంని అందించారు. అనంతరం పరిశుద్ధ దివ్యబలి పూజను సహాయమత దేవాలయ సహాయక గురువు ఫాదర్ జోసఫ్, ఫాదర్ జీవన్, నిర్వహించారు. అనంతరం భక్తులకు చక్కటి ప్రేమ విందును స్థానిక గ్రామస్తులు ఏర్పాటు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *