Breaking News

ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు సౌర‌భ్ శ‌ర్మ , మ‌ద‌న్ కుమార్‌లు ప‌రిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి శుక్ర‌వారం జ‌రిగిన నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు సౌర‌భ్ శ‌ర్మ , మ‌ద‌న్ కుమార్‌లు ప‌రిశీలించారు. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌, మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ రిట‌ర్నింగ్ అధికారి ఆధ్వ‌ర్యంలో నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ జ‌రిగింది. చ‌ట్ట నిబంధ‌న‌లు, ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియను చేప‌ట్టిన‌ట్లు ఆర్‌వో తెలిపారు. తిరువూరు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, మైల‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులుగా సౌర‌భ్ శ‌ర్మ ఉన్నారు. అదే విధంగా విజ‌య‌వాడ తూర్పు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ్య‌య ప‌రిశీల‌కులుగా మ‌ద‌న్ కుమార్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *