అభ్యర్ధులు మరియు వారి ప్రతినిదుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 31 నామినేషన్లు ఆమోదించుట జరిగిందని నగర పాలక సంస్థ కమీషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎన్నికల షెడ్యులు మేరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు మరియు వారి ప్రతినిదుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమీషనర్ మరియు ఆర్.ఓ మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి దాఖలైన 55 నామినేషన్లను పరిశీలించామని, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల మేరకు సరైన ధ్రువ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్స్ లేని 8 నామినేషన్లను తిరస్కరించుట జరిగిందని, 47 నామినేషన్లను ఆమోదించుట జరిగిందని తెలిపారు. 47 నామినేషన్లలో డమ్మీలుగా, అదనపు నామినేషన్ సెట్లు దాఖలు చేసిన వాటిని అభ్యర్ధుల సమక్షంలోనే తిరస్కరించుట జరిగిందన్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 31 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ నెల 27 మరియు 29 వ తేదీలలో ఉపసంహరణ అనంతరం ది. 29-4-2024 వ తేదీన తుది జాబితా ప్రకటించుట జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *