Breaking News

30వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఒకటో వార్డులో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని….
-వీధి వీధిన పూల మాలలతో…. ఎమ్మెల్యే నానికు ఘన స్వాగతం పలికిన ప్రజానీకం…
-జగన్ మార్క్…ప్రతి ఇంట్లో…ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది…
-జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ….దేశంలో ఏ నాయకుడికి లేదు….
-వాలంటీర్లు ఇంటికి రావాలన్నా….లంచాలు లేని పాలన జరగగాలన్నా….ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి…

గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 30వ రోజుకు చేరుకుంది.గుడ్లవల్లేరు మండలం కౌతవరం ఒకటో వార్డులో ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సీపీ శ్రేణులు…. ప్రజానీకం గజ మాలలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు…. స్థానికులతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి….. ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ…. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజలు సత్కరించారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర జండాలు చెట్టు వద్ద ప్రార్థనలు నిర్వహించి మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు… వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు పూల వర్షాలు కురిపిస్తూ గజమాలలు వేస్తూ పార్టీ నాయకులు… అభిమానులు ఎమ్మెల్యే కొడాలి నానిపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ప్రచారం ఆశాంతం తీన్మార్ డప్పుల మధ్య…. టపాసులు కాలుస్తూ స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా…. సిఎం జగన్ బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు నిలబడ్డ జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో జగన్ పెడతారని….. చంద్రబాబులా అబద్దపు హామీలు ఇవ్వరనీ కొడాలి నాని స్పష్టం చేశారు.జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందన్నారు. మూడు సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని మోసగాడు చంద్రబాబు కావాలో..? బాబులా మోసపు వాగ్దానాలు చెయ్యని జగన్ లాంటి నిజాయితీపరపడు కావాలో ? ప్రజలు తేల్చేకోవాలన్నారు. దత్తపుత్రుడు.. ఢిల్లీ నుండి.. తెచ్చుకున్న మోడి పాంప్లేట్ 2014 లో ఇంటింటికి పంపారు.బాబు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేసాడా ? పొదుపుసంఘాల రుణ మాఫీ చేసాడా? ఆడపిల్లలకు ఓక్క రూపాయైనా డిపాజిట్ చేసాడా? ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి.. ఇచ్చాడా ? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం అన్నాడు.. ఓక్క సెంటైనా ఇచ్చాడా? సింగపూర్ .. అభివృద్ధి అన్నాడు.. జరిగిందా ..? అని కొడాలి నాని ప్రశ్నించారు. వారి అబద్ధపు మాటలను ప్రజలందరూ తిప్పుకొడుతూ….. ఎన్నికల్లో సీఎం జగన్ కు మద్దతుగా నిలబడాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో గుడ్లవల్లేరు మండల వైసీపీ అధ్యక్షుడు శాయన రవి, ఎంపీపీ కొడాలి సురేష్, వైస్ ఎంపీపీ పోలగాని రమాదేవి, సీనియర్ వైసీపీ నాయకులు పాలేటి చంటి, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఉపధ్యక్షుడు జాన్ బెన్నీ లింగం, జిల్లా వ్యవసాయ కమిటీ సలహాదారు పెన్నేరు ప్రభాకర్ రావు, యువజన విభాగ అధ్యక్షుడు గుదేరవి, మహిళా విభాగ అధ్యక్షురాలు మరియు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పడమట సుజాత, PACS చైర్మన్ వడ్లమూడి చిన్ని, మండల బూత్ కన్వీనర్ కోటప్రోలు నాగు,శ్రీ కొండాలమ్మవారి దేవస్థాన కమిటీ చైర్మన్ శేషం గోపి, ఎంపీటీసీలు చీరా దుర్గాభవాని, మెరుగు నాగేంద్రం, ముక్కు సోమేశ్వరరావు, పెనుమాల పూర్ణ కవిత, కొడాలి కన్నమ్మ , ఈడే లక్ష్మి, మండ దిలీప్ కుమార్, సర్పంచులు బోట్ల వీరమ్మ, కాలిశెట్టి అర్జున్ రావు, ముత్యాల సాంబయ్య, గోసాల జ్యోతి, కటికల జ్యోతి, వీర్నాల లక్ష్మణరావు, మేడేపల్లి రవికుమార్, గళ్ళ అక్కయ్య, వైస్ సర్పంచ్ అబ్దుల్ ఇక్బాల్, కోటప్రోలు శ్రీను, నందం శ్రీనివాసరావు, పోతుల శివనాగులు, జుజ్వరపు రాణి,
కౌతవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొండలమ్మ అమ్మవారి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ బాడిగ నాని, బెజవాడ దేవరమ్మ, చీరా అశోక్, ఈడే ప్రసాద్, మన్నెం చంటి, నాగూర్, పడమట నాంచారయ్య, అడుసుమిల్లి ఐశ్వర్య, షేక్ సుభాని, పాగోలు సాయి శంకర్, గూడూరు కార్తీక్, అబ్దుల్ సలాం, జాఫర్ ఖాన్, md రఫీ, బషీర్ ఖాన్, ఎస్.కె బాజీ,ఎస్.కె ఆదాం, మద్దాల రోశయ్య, మద్దాల కొండలు, మద్దాల డేవిడ్, తంబి,
గుడ్లవల్లేరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
PACS బ్యాంక్ చైర్మన్ దుగ్గిరాల శేషుబాబు, శాయన దుర్గాప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, కొడాలి సుధాకర్, బెజవాడ వెంటేష్, రెమల్లి ప్రసాద్, ఈడే వెంకట ప్రసాద్, ముత్యాల ప్రవీణ్, యార్లగడ్డ వేణు, మన్నెం చంటి, md బాజీ, పామిరెడ్డి సతీష్ రెడ్డి, కొనకళ్ళ సాయి, md ఇషాక్, యార్లగడ్డ వేణు, బొట్ల ఫణి, పోస్టల్ రాజు, పెనుమాల రంగారావు, యార్లగడ్డ పైడేశ్వరరావు, మహమ్మద్ రబ్బాని, జన్ను చిరంజీవి, దుగ్గి ఏసు రాజు, పామర్తి హరిబాబు, కొప్పర్తి ప్రసాద్, మన్నెం వీరయ్య,
నియోజకవర్గంలోని పలు గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొండపల్లి కుమార్ రెడ్డి, గిరి బాబాయ్, పిల్లి బెనర్జీ, సూరపనేని కళ్యాణ్, కసుకుర్తి బాబ్జి, వడ్లాని సుధాకర్, బలుసు జితేంద్ర, చుండూరు శేఖర్, Kj విక్టర్ పాల్, పుల్లేటికుర్తి కృష్ణ, ఘంటా సురేష్, ఘంటా శ్రీను, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, జ్యోతుల మణికంఠ, చుండి బాబి, పాలడుగు రాంప్రసాద్, కొచ్చర్ల అనిల్, కొత్తూరి లక్ష్మీనారాయణ,పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్,గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *