గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంల ర్యాండమైజేషన్ మేరకు ఈవిఎంలను కమిషనింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం స్థానిక ఏసి కాలేజిలో జరగనున్న ఈవిఎంల కమిషనింగ్ ఏర్పాట్లపై తూర్పు నియోజకవర్గంలోని పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో, అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఈవిఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారిగా ఈవిఎంల ర్యాండమైజేషన్ పూర్తి అయిందని, ఏసి కాలేజిలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోని ఈవిఎంల కమిషనింగ్ ఈ నెల 3 తేదీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఈవిఎంల కమిషనింగ్ చేసే హాల్ ని పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. కమిషనింగ్ కి హాజరయ్యే ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. సెక్యూరిటి సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ వద్ద నిరంతరం భద్రత ఉండాలని, రిటర్నింగ్ అధికారి ఆధీకృత గుర్తింపు కార్డ్ ఉన్న వారిని మాత్రమె స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లోకి రానివ్వాలని స్పష్టం చేశారు.
పర్యటనలో ఏఆర్ఓ, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏసిపి మురళి, డిఈఈ రమేష్ బాబు, ఏఈ సునీల్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News