అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సూక్ష్మ చిన్నా మరియు మధ్యతరహా శాఖపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొదటిసారి ఆంధ్రప్రదేశ్ యం యస్ యం ఈ కార్పొరేషన్ నందు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి ఎమ్మెస్ ఎం ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఈఓ ఆదర్శ రాజేంద్రన్ మరియు వివిధ విభాగాల అధిపతులు హాజరయ్యారు. చిన్న పరిశ్రమల శాఖలో అమలవుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించి వాటి పురోగతిపై వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు వివిధ పథకాల అమలు తీరును పరిశీలించారు వాటికి సంబంధించి శాఖ పరంగా ప్రభుత్వం దృష్టికి ఏ ఏ అంశాలను నివేదించాలో అధికారులు మంత్రిగారికి వివరించారు ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం రైసింగ్ అండ్ ఆక్సిలరేటింగ్ ఆఫ్ ఎం ఎస్ ఎం ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పిఎంఈజీపి ప్రోగ్రాం , క్రెడిట్ గ్యారెంటీ పథకం, ఎం ఎస్ ఎం ఈ టెక్నాలజీ సెంటర్స్, పీఎం విశ్వకర్మ మరియు ఎమ్మెస్ ఎం ఈ పార్కుల పురోగతి పై మంత్రివర్యులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు వివిధ పథకాలపై తగిన సూచనలు అందించారు ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని వాటిపై గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. అని అన్నారు. ఈ సమీక్షా సమావేశానికి జి సుదర్శన బాబు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎం శ్రీనివాసులు రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎం శ్రీనివాసరావు జాయింట్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News