-ఎప్పటికప్పుడు వ్యర్థ సేకరణ చేస్తూ పారిశుద్ధ నిర్వాహన పక్కాగా జరిపించండి
-నగర ఇంచార్జి కమిషనర్ డాక్టర్ మహేష్ అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం దేవినగర్, వన్ టౌన్,పాతబస్తీ, పంజా సెంటర్, ఆయుష్ హాస్పిటల్ రోడ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించారు.
ముందుగా దేవినగర్లో విజయవాడ వైజాగ్ లైన్ దగ్గర గల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ సిబ్బందితో పరిశీలించారు. తదుపరి వన్ టౌన్ జెండా చెట్టులో గల బి టీ రోడ్డు, పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. నిరంతరం డీసెల్టింగ్ పనులు చేస్తూ మురుగు ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయుష్ హాస్పిటల్ రోడ్, హై టెన్షన్ వైర్ రోడ్డు, రామవరపాడు నేషనల్ హైవే సర్వీస్ రోడ్ లో ఉన్న వర్షపు నీటిని నిలువలను పరిశీలించారు ఇంజనీరింగ్ సిబ్బంది వర్షపు నీటి నిల్వలను లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యర్ధాల సేకరణ ఎప్పటికప్పుడు చేస్తూ వ్యర్ధాలను రోడ్డు మీద పారి వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే సీజనల్ వ్యాధుల నుండి దూరంగా ఉండగలమని, అందుకు విజయవాడ నగరపాలక సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా నగరపాలక సంస్థకు సహకరిస్తూ చెత్తను వీధుల్లో పారవేయకుండా తమ వంతు కృషిని అందించాలని కోరారు.
Prajavartha Online Telugu News