-యూఏఈ పెట్టుబడిదారులతో రౌంట్ టేబుల సమావేశంలో పాల్గొన్న మంత్రి టిజి భరత్, యూఏఈ అంబాసడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్‌షాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూఏఈ నుండి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యూఏఈ – ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూఏఈ అంబాసడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్‌షాలీ, ఏపీతో పాటు దుబాయ్ వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి టి.జి భరత్ వారితో చర్చించారు. యూఏఈ అంబాసడర్ అబ్దుల్ నాసిర్ జమాల్ అల్‌షాలీ మాట్లాడుతూ ఏపీలో పెట్టాలనుకున్న ప్రాజెక్టులు గత ఐదేళ్లలో పక్కకు వెళ్లాయన్నారు. మొదటగా ఈ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో లులూతో పాటు పలు కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయని చెప్పారు. తమ ప్రభుత్వంలో యూఏఈ నుండి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. గతంలో యూఏఈ పెట్టుబడిదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే దిశలో ముందుకు వెళతామన్నారు. అప్పుడే మరికొందరు ముందుకొచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తారని పేర్కొన్నారు. నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల్లో నమ్మకం కలిగిస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. యూఏఈ వ్యాపార ప్రతినిధులు పలు ప్రజెంటేషన్లు ఇచ్చారని మంత్రి టి.జి భరత్ తెలిపారు.