-డి ఆర్ ఆర్ ఇండోర్ స్టేడియం పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒలంపిక్స్ లో విజయాలు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని, క్రీడాకారులకు సకల సౌకర్యాలు విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కల్పిస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఎంజీ రోడ్ లో గల, డి ఆర్ ఆర్ ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడున్న కోచ్ తో అన్నారు. దండమూడి రాజగోపాల్ రావు స్టేడియంలో క్రీడాకారులకు క్రీడా నైపుణ్యం పెంచే వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు, స్టేడియంలో అవసరమయ్యే మరమతులన్నీ, త్వరతిగతిన పూర్తి చేసి క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి ఒలంపిక్స్ లో విజయాలు సాధించే విధంగా వాళ్లలో ప్రేరణ పెంచాలని అన్నారు. దానికి అవసరమయ్యే వసతులు విజయవాడ నగరపాలక సంస్థ కల్పిస్తుందని అన్నారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు డీఎఫ్ఓ మరియు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ డి.మాల్యాద్రి, ఎస్ ఎఫ్ ఓ యం.రాజా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్, పాల్గొన్నారు.