గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ప్రసాద్ లతో కలిసి జిఎంసి ప్రధాన కార్యాలయాన్నిపరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని, వినియోగంలో లేని బీరువాలు, ఇతర సామగ్రిని తొలగించాలన్నారు. వ్యర్ధాలను ఆఫీస్ పరిసరాల్లో వేయకుండా డస్ట్ బిన్ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విభాగంలో సిబ్బంది డస్ట్ బిన్లను వినియోగించాలన్నారు. కార్యాలయ పరిసరాల్లో పచ్చదనం పెంపుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఏడిహెచ్ ని ఆదేశించారు.
Tags guntur
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …