మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు, అడ్మిషన్లు, అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలు, సమస్యలపై ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, ఇతర వసతులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. దివ్యాంగులకు చేతి కర్రలు, వినికిడి పరికరాలు, మూడు చక్రాల సైకిళ్ల పంపిణీపై ఆరా తీసి అధికారుల నుండి వివరాలను తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖలో విధులు నిర్వర్తించేందుకు తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని జిల్లా అధికారి కలెక్టర్కు తెలుపగా, దీనిపై సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీకి రాతపూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి షేక్ షాహిద్ బాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ కే శంకర్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి ప్రకాష్ రావు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వాడ్రేవు కామరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …