విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమ కాటు వల్ల కలుగు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి జ్వరాలను అరికట్టేందుకు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లో ప్రజా ఆరోగ్య విభాగం పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలను జ్వరాల బారిన పడకుండా ఆటో ఫకింగ్ మరియు హ్యాండ్ ఫాగింగ్ చేశారు.
కేదారేశ్వరపేట, ఫైజర్ పేట, ఆంజనేయ వాగు, బాంబే కాలనీ (ఏ,బి,హెచ్ బ్లాకులు), రాజీవ్ నగర్, ద్వారక నగర్,నల్లగేట్ సెంటర్, శివశంకర పురం, హరినాధపురం, చౌదరి పేట, బ్రమరాంబపురం, గాయత్రి నగర్, పటమట, ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్, కోనేరు వారి స్ట్రీట్, జెడి నగర్,లక్ష్మీపతి కాలనీ, అయ్యప్ప నగర్ సిరీస్ రోడ్ ధనికుల వారి వీధి కరివేపాకు స్ట్రీట్, బావాజీపేట శ్రీనగర్ కాలనీ, సత్యనారాయణపురం,బ్రాహ్మణ స్ట్రీట్,ఆర్ఆర్ అప్పారావు స్ట్రీట్, తారాపేట, బి ఆర్ పి క్రాస్ రోడ్, నందు ఆటో ఫాగింగ్ మరియు ఇతర ప్రాంతాలలో హ్యాండ్ ఫాగింగ్ చేసి దోమలను నియంత్రించారు.
ఒకవైపు దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడేగా మార్చేందుకు విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 డివిజన్లో కూడా హెల్త్ సెక్రటరీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి, ఇంటి పరిసరాల్లో వాళ్ళకి తెలియకుండానే ఉన్న నీటి నిల్వలను చూపించి దోమల లార్వకు ఆస్కారం ఉండే అవకాశాలు ఉంటాయని ప్రజల్లో అవగాహన కల్పించి, నీటి నిలువలను పారవేసి, ఇటువంటి కార్యక్రమాలను ప్రతి శుక్రవారం ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే, దోమలను నియంత్రించవచ్చని తద్వారా దోమల వల్ల కలిగే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి జ్వరాలు నుండి ప్రజలు కాపాడుకోవచ్చని తెలుపుతున్నారు.