పేదలందరికీ పక్కా ఇంటి కల సాకారం చేస్తాం

-హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు
-ఇంటి పట్టాల పేరుతో స్కాములకు పాల్పడ్డారు
-నిర్మాణానికిచ్చే సొమ్ములో కూడా జగన్ రెడ్డి కక్కుర్తి చాటుకున్నాడు
-కేంద్రం ఇచ్చే సొమ్మును తానిస్తున్నట్లు డ్రామాలాడాడు
-ఏడాదిలో పక్కా ఇళ్లు అందించాలని అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు పక్కా ఇంటి కల సాకారం చేసి తీరాల్సిందేని రాష్ట్ర గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు మచిలీపట్నంలోని నివాసంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా, ఎవరికీ న్యాయం చేసింది లేదు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కాములకు తెరలేపారు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇచ్చి అవే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరుకు సిద్ధమయ్యాం. త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఆ మేరకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. నాడు ఎన్టీఆర్ పక్కా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్లీ ఇళ్ల పండుగ ప్రారంభం కాబోతోందన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *