విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ శనివారం గుణదలలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమదాన్ మదర్ థెరిస్సా ఆశ్రమంలో , విజయమేరీ అంధుల పాఠశాల లో , మడోన్నా ఇన్ స్టిట్యూట్స్, మడోన్నా హై స్కూల్ ఫర్ ది డెఫ్ స్కూల్ కి అవసరమైన నిత్యావసర సరుకులు, కంప్యూటర్ ప్రింటర్, 25 సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు.
కేశినేని శివనాథ్ మిత్రబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన కేశినేని జానకి లక్ష్మీ కేక్ కట్ చేయగా విద్యార్దులందరూ ఎంపి కేశినేని శివనాథ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విధ్యార్ధులకి కేక్ పంపిణీ చేయటం జరిగింది. మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రేమదాన్ మదర్ థెరిస్సా ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే విజయమేరీ అంధుల పాఠశాలకి అవసరమైన విద్యార్ధులకు నిత్యావసర సరుకులతో పాటు , కంప్యూటర్ ప్రింటర్ అందజేయటం జరిగింది. మడోన్నా ఇన్ స్టిట్యూట్స్, మడోన్నా హై స్కూల్ ఫర్ ది డెఫ్ కి అవసరమైన 25 సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. మడోన్నా ఇన్ స్టిట్యూట్స్ తరఫున సిస్టర్ గ్లోరి, విజయమేరీ అంధుల పాఠశాల తరుఫున హెచ్.ఎమ్. సిస్టర్ రాజీ, ప్రేమదాన్ మదర్ థెరిస్సా ఆశ్రమం తరుఫున సిస్టర్ లసిట లకు కేశినేని జానకీ లక్ష్మీ అందజేయటం జరిగింది.