Breaking News

నేషనల్ వాస్కలర్ డే వాకింగ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుండి నేషనల్ వాస్కలర్ డే వాకింగ్ ను ఆదివారం డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, IAS  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీ షాపాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ వాకర్స్ డే సందర్భంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలకు వారి హెల్త్ మీద ఎవర్నెస్ కల్పించే విధంగా డాక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రజలు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, దీనికి డబ్బులు ఏమి ఖర్చు అయ్యే పని కాదని రోజు వాకింగ్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాకింగ్ చేసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా మునిసిపల్ పార్కులను జిమ్ ఎక్కువ మెంట్స్ తో పిల్లల ఆడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ప్రతి ఒక్కరు డైలీ వాకింగ్ చేయాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *