జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో జరగనున్న జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టిఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచించారు. సోమవారం ఎన్డీయే కార్యాలయంలో కూటమి నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి జాబ్ మేళా విధివిధానాలను స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా నిరుద్యోగులను గుర్తించి సుజనా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా గురించి ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, రిలయన్స్ జియో, బిగ్ సి, బిగ్ బాస్కెట్, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో ఫార్మసీ, బ్యాంకింగ్, నవత ట్రాన్స్పోర్ట్ వంటి, అనేక బహుళ జాతీయ కంపెనీలు హాజరై 3 వేల ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. పశ్చిమలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ధ్యేయంగా సుజనా కృషి చేస్తున్నారన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు పాల్గొనాలని కోరారు. సంబంధిత సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో హాజరు కావాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 7032399488,9000412345, అనే నెంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణ కిషోర్, ఇన్చార్జ్ చింతపల్లి అజయ్ బాబు, మోహన్ వంశీ, కార్పొరేటర్ బుల్లా విజయ్, బొమ్మ కంటి వెంకటరమణ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *