విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ యూనియన్ సంవృద్ధి పై అవగాహన కల్పించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘బైక్ ర్యాలీ’ నిర్వహించింది. సోమవారం బిఆర్‌టిఎస్ రోడ్డులో ఈ స్కీమ్‌కు సంబంధించిన ప్లకార్డ్‌లను పట్టుకుని ‘బైక్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ, జోనల్ హెడ్ సివిఎన్ భాస్కర్‌రావు మాట్లాడుతూ యుబిఐ డిపాజిట్ ప్లాన్ల ద్వారా చాలా మంది తమ పొదుపులను అభివృద్ధి చేసుకోవడానికి సురక్షితమైన మరియు నమ్మదగిన సేవలందిస్తున్నామన్నారు. మా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి మరియు కొత్త కస్టమర్లను ఆహ్వానించడానికి మా బ్యాంక్ యుబిఐ 333 రోజులపాటు ‘‘యూనియన్ సంవృద్ధి’’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకం క్రింద మార్కెట్లో అత్యధిక వడ్డీ రేటు, సాధారణ ప్రజలకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90% మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15% పొందగలరు. కొత్త స్కీమ్ ‘శాం ఆరంభ్’ గురించి తెలిపారు. ఆర్థిక, ఆరోగ్య కారణాల వలన తమ వ్యాపారాన్ని కోల్పోయిన నిజమైన రుణ గ్రహీతలకు ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం కింద బకాయిలు చెల్లించిన తర్వాత రైతులు తాజా రుణాన్ని పొందవచ్చు, ఇది రైతులకు గొప్ప అవకాశం అన్నారు. యుబిఐ డిపాజిట్ మరియు రికవరీ పథకాలు మాత్రమే కాకుండా, మా బ్యాంక్ అన్ని వర్గాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక ఉత్పత్తుల ద్వారా సమాజంలోని పేద ప్రజల కోసం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎం.సీతారామారావు, ఎ.శారదమూర్తి, రీజనల్ హెడ్, విజయవాడ, ఎం.శ్రీధర్ మరియు జోన్‌ల్, రీజనల్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …