సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం తీసుకునే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగులుగా ఎల్లప్పుడూ ముందు ఉండి విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వంకు మంచి పేరు తీసుకురావటానికి కృషి చేస్తామని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్‌ పంపిణీి 1వ తేదీన 90 శాతంపైగా పంపిణీి చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇటువంటి ప్రాధాన్యత ఉన్న తాము గత కొంతకాలం నుండి ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండిరగ్‌ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొవాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు తెలిపారు. సోమవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ఆలస్యంగా చేయటం వలన తమకు రావలసిన బకాయిలన్ని మంజూరు చేయాలన్నారు. ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ అయిన దగ్గర నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ కల్పించాలి, సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఛానల్‌ క్రియేట్‌ చేసి పదోన్నతులు కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులు విధానాన్ని రద్దు చేయాలని, సచివాలయ ఉద్యోగులపై బహుళ శాఖ విధానం లేకుండా చేసి మాతృ శాఖ మాత్రమే అజమాయిషి ఉండాలని ఆయన కోరారు. సచివాలయల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై, ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ వేసి, సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నూతన కమిటీగా రాష్ట్ర అధ్యక్షులుగా తోటకూర కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వై.రత్నం పుట్టి, కోశాధికారి టి.తిరుమలయ్య, సహాఅధ్యక్షులు ఎం.రమేష్‌బాబు, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు ఎస్‌.హరి, రవికుమార్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, మోహన్‌రావు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *