ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించాలన్నారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఆకలితో ఉండరాదని, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగాలని, వారి హాజరు పెరగాలని బాలురు బాలికల మధ్య లింగ బేధం తగ్గించాలని, సామాజికంగా సమానత్వం పాటించాలని, పోషకాహార లోపాన్ని తగ్గించాలనే ప్రధాన ఉద్దేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. జిల్లాలో తాను కొన్నిచోట్ల పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా భుజించానని అంతా బాగుందన్నారు. ఎక్కడైనా నిజంగా భోజనం సరిగా లేకపోతే, సరిగా వండకపోతే నిబంధనల ప్రకారం త్రిసభ్య విద్యా కమిటీ విచారణ జరిపి వంట ఏజెన్సీని మార్చడం జరుగుతుందన్నారు. అయితే పెడన పెనమలూరు ప్రాంతాల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా తీసుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమే తాను పెడనలో పాఠశాలను తనిఖీ చేసి విచారించానని అది వాస్తవం అని గుర్తించి వంట ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశామని డిఈ ఓ తహేరా సుల్తానా జిల్లా కలెక్టర్ కు వివరించారు.

కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం లావుగా ఉండడంతో విద్యార్థులు ఇష్టపడటం లేదని, సరిగా తినడం లేదని చెప్పారు. బిపిటి వంటి సన్న బియ్యం పై వారు ఆసక్తి చూపుతున్నారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం ఫోర్టిఫైడ్ కెన్నెల్ కలిగిన పౌష్టికాహార బియ్యమని, ఆ బియ్యంలో సూక్ష్మ పోషకాహాలు, విటమిన్ బి 12 ఉన్నాయని, ఆ బియ్యం తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. బాలికల్లో రక్తహీనత శాతం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ విషయం పైన విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు సరైన అవగాహన లేదన్నారు. దీనీపై విస్తృతంగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై తనతో పాటు, ఒక డాక్టర్ చేత మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా భుజించాలని, అందులో వాడుతున్న బియ్యం లో సూక్ష్మ పోషకాలు ఉన్నాయని తెలియజేసే వీడియో తయారు చేయించి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వినియోగించి విద్యార్థులందరినీ చైతన్య పరచాలన్నారు. విద్యార్థులకు చిక్కీలు, కోడిగుడ్లు నిర్ణిత ప్రమాణాల్లో అందజేస్తున్నారా లేదా వంట ఏజెన్సీలకు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అని కలెక్టర్ విచారించారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ,డి ఈ ఓ తహెరా సుల్తానా, జడ్పీసీఈఓ ఆనంద్ కుమార్, డీఎస్ఓ పార్వతి, పౌరసరఫరాల సంస్థ డిఎం సతీష్,సర్వ శిక్ష ఏపీసి శ్రీరాములు నాయక్, బీసీ సంక్షేమ అధికారి రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *