గత ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు…

-ఏపిఎన్జిజివో రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. పురుషోత్తం నాయుడు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అంశాలపై గత ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల సంక్షేమం ఎన్. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సత్యదొరమని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కే.వీ. శివారెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు తెలిపారు. స్థానిక గాంధీనగర్ లోని ఎన్జీవో హోమియో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిజానికి గత ప్రభుత్వ హయం ఐదు సంవత్సరములు ఉద్యోగులకు చీకటి రోజులని, ఉద్యోగులకున్న సర్వహక్కులను ప్రయోజనాలను గత ప్రభుత్వం హరించి వేసిందని, ఉద్యమాలకు ఉపక్రమించిన ఉద్యోగ సంఘాల నాయకులు పై ఉద్యోగులపై ఉపాధ్యాయులపై 4000 కేసులు పెట్టిన ప్రభుత్వం ఇంకోటి లేదని, గత ఐదు సంవత్సరాలుగా వీటి మీద ఎవ్వరూ కూడా ఒక్క మాట మాట్లాడలేదని, ఈ కేసులన్నిటినీ పరిశీలించి ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని అన్నారు.

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేని విధంగా 11వ పి ఆర్ సి ని రివర్స్ పిఆర్సిగా చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని దేనిని, పిఆర్సి కమిషన్ రిపోర్ట్ గడువు ను నాలుగు సంవత్సరాలకు పొడిగించి, కనీసం PRC రిపోర్టును కూడా ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండా, ఉద్యోగులు ఆప్షన్ ఇవ్వకుండా, జీతభత్యాలను తగ్గించి ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వమేనని తెలిపారు. ఉద్యోగుల జిపిఎఫ్ అకౌంట్ లో నుంచి గత ప్రభుత్వం డబ్బులు డ్రా చేస్తే కనీసం నోరు మెదపనివారు, ఇప్పుడు నెల తిరగకుండానే సుద్దులు చేపటం సరికాదన్నారు. జిపిఎఫ్, ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలను సంవత్సరాల తరబడి బాకీ పెట్టిన గత ప్రభుత్వం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 21900 కోట్ల రూపాయల్ని బకాయిలు పెట్టారని, పూర్తి వివరాలు అందితే అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధ్యాయులపై ప్రవీణ్ ప్రకాష్ వైఖరి, 117 ఉత్తర్వులు ద్వారా విద్యా వ్యవస్థను నాశనం చేసి, CPS రద్దు హామీని మరచిపోయి, GPS ను బలవంతంగా రుద్ది, ఉపాధ్యాయులపై ఉక్కు పాదం మోపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కనీసం ఉపాధ్యాయులను బాత్రూంలో వద్ద, మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేసినప్పుడైనా ఎన్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు వచ్చేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఎడిషనల్ క్వాంటం పెన్షన్ చంద్రబాబు నాయుడు 2018 లో 10 శాతానికి మంజూరు చేయగా, గత ప్రభుత్వం దానిని ఏడు శాతానికి కుదించిందని, పునరుద్ధరించాలని ఉద్యమం చేస్తున్న పెన్షనర్లకు 10 శాతం చేస్తామని మభ్యపెట్టి ఉద్యమాన్ని విరమింపజేసిన గత ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు వారికి మొండి చేయి చూపటం నిజం కాదా అని ప్రశ్నించారు. అసలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వ్యవస్థను, వారి స్థితిగతులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి వెంటిలేటర్ మీద చేర్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని, కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే ఇవన్నీ పరిష్కారం కావు, ఉద్యోగులకు మొండి చేయి అని ప్రకటించడం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వ జీతం మీద ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా కనీసం ఏ ఒక్క విషయంలోనైనా మంచి సలహా ఇచ్చి ఆచరింప చేసి ఉంటే ఉద్యోగులకు మంచి జరిగేది కదా అని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీ జీవో సంఘ మాజీ నాయకులు అనేకమంది వివిధ పార్టీలో ఉన్నారని, వారు పార్టీ ప్రయోజనాలు అనుగుణంగా మాట్లాడుతుంటారని, వారికి ఏపీ ఎన్జీవో సంఘంతో ఎటువంటి ప్రమేయం లేదని, ఏపీ ఎన్జీ జీఓ సంఘం ఉద్యోగుల ప్రయోజనాలపై దృష్టిలో పెట్టుకుని నిరంతరం పని చేస్తుందని తెలిపారు.

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించటం, జిపిఎస్ gazette పై ప్రకటన, ఉద్యోగులపై ఉన్న నాలుగు వేల కేసులు ఎత్తివేస్తానని ప్రకటించడం, అధికారులతో ఉద్యోగులతో గౌరవంగా మేలగాలని మంత్రులకు కలెక్టర్లకే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం వంటి చర్యలు ఈ ప్రభుత్వంపై ఉద్యోగులలో నమ్మకాన్ని పెంచాలని, ఏపీ ఎన్జీజీవో సంఘం కూడా కూటమి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించి ఉద్యోగుల డిమాండ్లు అన్నిటినీ పరిష్కరించడానికి కృషి చేస్తుందని తెలిపారు. IR ప్రకటించటం, వేతన సవరణ కమిటీని నియమించడం, 62 స|| పదవీవిరమణ అందరికి వర్తింపచేయడం వంటి అంశాలను చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తమని తెలిపారు. ఒకటో తారీఖున సామాజిక పెన్షన్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించిన అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *