ప్రభుత్వం అప్పగించిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అప్పగించిన పనులను నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ  వేగవంతంగా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం ఉదయం పంచాయతీ రాజ్, జలవనరుల శాఖలు, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంలలో చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు,  సంబంధిత శాఖల ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు, మీకోసం సమావేశ మందిరం, జడ్పీ మీటింగ్ హాలులలో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్,  డి ఎం ఎఫ్, సి ఎస్ ఆర్, పి ఎం జి ఎస్ వై తదితర ప్రభుత్వ నిధులతో మంజూరై చేపట్టిన పనులను తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిధుల కొరత లేదని పూర్తి చేసిన పనులకు ఎప్పటికప్పుడు సకాలంలోనే  చెల్లింపులు చేస్తామన్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల ఇంజనీర్లు పనులు పూర్తికాగానే ఎలాంటి ఆలస్యం చేయకుండా పనుల రికార్డింగ్, చెక్కు మెజర్మెంట్, బిల్లు పాస్ ఆర్డర్, అప్లోడ్ వెంట వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని సూచిస్తూ అటువంటి వాటిని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ఏదైనా సమస్య ఉన్నా లేదా ఇంజనీర్లు  సరిగా స్పందించకపోయినా గాని, బిల్లు సకాలంలో చెల్లింపు కాకపోయినా గాని తన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. తన వద్ద ఎప్పుడు రిమోట్ హేమర్ ఉంటుందని దాంతో స్తంభాల  పటిష్టతను గమనించడం అన్నారు జరుగుతుందన్నారు. బిల్లులు చెల్లింపు కాలేదని ఇంజనీర్లు వారి చుట్టూ కాంట్రాక్టర్లను తిప్పుకోరాదని హితవుపలికారు. సాగునీటి కాలువలు, మురికి కాలువలు నిర్మాణంలో కొందరు కాంట్రాక్టర్లు 40 శాతం తక్కువకు టెండర్లు వేస్తున్నారని ఆ విధంగా వేయమని ఎవరు చెప్పడం లేదన్నారు. దీనిని బట్టి పరిశీలిస్తే ఎస్ఎస్ఆర్  ధరలు ఎక్కువ ఉన్నాయా అని అనిపిస్తుందన్నారు. ఆ విధంగా తక్కువకు టెండర్లు వేసి కొన్ని పనులు చేసి గిట్టుబాటు కావడం లేదని ఆ తదుపరి పనులు చేయలేమని ఆపేస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తామని,  టెండర్లు వేసినప్పుడు పోటీపడి గ్రూపులు ఏర్పడి తర్వాత చేయలేమని ఎవరైనా కాంట్రాక్టర్లు చెబితే అటువంటి వారి నుండి పూర్తి మొత్తం వసూలు చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ నెలలో వర్షాలు వచ్చి డ్రైనేజీలు నీరు నిండిపోయి పనులు ముందుకు సాగలేవన్నారు.
అందువలన అప్పగించిన పనులను నిర్ణీత గడువులో  పూర్తి చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ సమావేశాలలో జిల్లా పోలీసు అధికారి ఆర్. గంగాధర్ రావు, పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయ్ కుమారి, ఈ ఈలు శ్రీనివాసరావు,  రమణరావు, డ్రైనేజీ ఈ ఈ విజయలక్ష్మి, సిపిఓ గణేష్,  పంచాయతీరాజ్, జలవనరులు, ఆర్డబ్ల్యూఎస్ శాఖల డి ఈ లు, ఏ ఈ లు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *