మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పిఎసిఎస్ ల కంప్యూటరీకరణ, పిఎసిఎస్ లలో విద్యుత్, హార్డ్వేర్, పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషది కేంద్రాల ఏర్పాటు, పిఎసిఎస్ పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు అనుమతి, మల్టీ పర్పస్ గోడౌన్ల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 213 పిఎసిఎస్ లను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కెడిసిసిబి)కు అనుబంధంగా కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టామని, త్వరలోనే అది పూర్తి కానున్నట్లు అధికారులు వివరించారు. జిల్లాలోని నందమూరు, ఉల్లిపాలెం, కౌతరం, ఆముదాలపల్లి నాలుగు పీఏసీఎస్ లకు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఎన్ఓసి జారీ చేసినట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి కే చంద్రశేఖర్ రెడ్డి, కే డి సి సి బ్యాంక్ సీఈవో శ్యాం కుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ ఉపసంచాలకులు మనోహర్ రావు, జిల్లా ఆడిట్ ఆఫీసర్ భాస్కరరావు, జిల్లా పరిశ్రమల మేనేజర్ వెంకట్రావు, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ విజయ కుమారి, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …