– వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిని నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయులు ఆదివాసీయులని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి జీవన పద్ధతులు, పరస్పర సహకారం, ప్రాచీన చరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు నిలువుటద్ధంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ.. వారి సంక్షేమం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. దేశానికే ఆదర్శంగా ఆదివాసీ అభివృద్ధి కార్యాచరణను అమలు చేశామని.. గిరిజనులకు ప్రాధాన్యతనిస్తూ రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని అడవి తల్లిని వేడుకొన్నారు.