క్షయ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్స్ మంత్రి పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర శుక్రవారం బందరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఆర్థిక సౌజన్యంతో, కారుణ్య రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్షయ వ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్స్ మంత్రి పంపిణీ చేశారు. క్షయ వ్యాధి వల్ల ఎవరు మరణించకూడదని, క్షయ నివారణకై ప్రభుత్వపరంగా ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ కార్యక్రమం కింద క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి తగిన చికిత్స అందించడంతోపాటు న్యూట్రిషన్ ఫుడ్ అందించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 50 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు మూడు నెలలకు సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ అందించేందుకు ముత్తూట్ ఫైనాన్స్ సి ఎస్ ఆర్ క్రింద ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్వో (టీబి కంట్రోల్) డాక్టర్ ఏ వెంకట్రావు, ముత్తూట్ ఫైనాన్స్ csr మేనేజర్ లక్ష్మీనారాయణ స్వామి, కారుణ్య రూరల్ డెవలప్మెంట్ ఎన్జీవో ప్రెసిడెంట్ టి మధుసూదన్ రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి లంకె నారాయణ ప్రసాద్, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, కుంచె నాని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *