విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు మరియు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలను అరికట్టాలని, ప్రజలందరిని సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాలికను సిద్ధం చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఈ రోజు సైబర్ నేరాలపై ప్రజలలోభారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్తాన్ మరియు బెంజ్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వి.అనిత పాల్గొని సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన, ఫిర్యాదుల కోసం రూపకల్పన చేసిన యాప్‌ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వి.అనిత మాట్లాడుతూ…. ఈ రోజు ఈ మంచి కార్యక్రామానికి శ్రీకారం చుట్టడమే కాకుండా భవిష్యత్తులో భావితారాలవారికి ఈ సైబర్ క్రైమ్ లో మోసపోకుండా ఉండటానికి అవేర్న్స్ కార్యక్రమం నిర్వహించడం, వారిద్వారా కొన్ని లక్షల మందికి అవగాహన కల్పించడానికి సైబర్ సోల్జర్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని, పెరుగుతున్న టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి కాని అదికొత్తపుంతలు తొక్కి మన మనుగడకే ప్రస్నార్ధకంగా మారే పరిస్థితి రాకూడదు అని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, 4 నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1730 కోట్లకు సైబర్ నేరాలకు పాల్పడ్డారని, దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయని, నిత్య జీవితంలో వినియోగించే అనేక యాప్‌ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని, యాప్‌లకు మనమిస్తున్న సమస్త సమాచారం ఒక్క క్లిక్‌తో మోసానికి దారితీస్తుందని, రాష్ట్ర స్థాయిలో సైబర్ సమన్వయ బృందం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పనిచేయాలని తెలియజేసారు.
ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు మాట్లాడుతూ…. రోజుకు 5 నుంచి 6 సైబర్ నేరాల ఫిర్యాదులు అందుతున్నాయని, విద్యార్థులు, వైద్యులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు.. ఇలా చాలామంది మోసపోతున్నారని, సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని, జాతీయ స్థాయిలో సైబర్ క్రైమ్ పోర్టల్ మోసగాళ్ల ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తుందని, 1930 పోర్టల్‌కు 98 బ్యాంకులతో అనుసంధానం ఉందని, సైబర్ మోసాల అవగాహన మహాయజ్ఞాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని, ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలపై ప్రజలలోభారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి 200 సైబర్ కమాండోలను మరియు కళాశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి కలిగిన 2000 మంది వరకు సైబర్ సోల్జర్స్ గా తీసుకోవడం జరిగిందని, మరో మూడు నెలల కాలంలో మూడు లక్షల మంది సైబర్ సోల్జర్స్ ను తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతుందని, వీరందరూ వారి ఏరియాలోని ప్రజలకు సైబర్ నేరాలు ఏవిధంగా జరుగుతాయి, సైబర్ నేరానికి గురికాకుండా ఉండాలంటే ఏ ఏ జాగత్ర్తలు తీసుకోవాలి? నేరం జరిగిన పక్షంలో ఏ విధంగా 1930 కు ఫిర్యాదు చెయ్యాలి? సైబర్ కమండోలు మరియు సోల్జర్స్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలలో అవగాహన కల్పిచడం మొదలగు విషయాలపై ప్రజలను చైతన్య పరిచి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం చేస్తారని తెలియజేసినారు.
ఈ క్రమంలో కలెక్టర్ జి.సృజన మాట్లాడుతూ…..మారుతున్న అవసరాలను బట్టి లైఫ్ లో ఎన్నో మార్పులు వస్తుంటాయి, అలాగే పోలిసింగ్ లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు మన జీవితంలో అంతగా లేని టెక్నాలజీ ఇప్పుడు విడదీయరాన్ని సంబంధంగా మన అందరి జీవితాల్లో ముడిపడి ఉందని, సులభతరమవుతున్న సాంకేతిక పరిజ్ఞానం అంతే నష్టాలను తెచ్చిపెడుతుందని, మన తెలియని తనాన్ని, అజాగ్రత్తని, అశ్రద్ధను ఆసారాగా చేసుకుని మనల్ని మోసం చేసి సైబర్ నేరాలు చేస్తున్నారు. అవగాహనతోనే సైబర్ నేరాల నుంచి రక్షణ పొందగలమని, చాలా మంచి ఆలోచన చేసిన విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఏదైతే శాస్త్రీయ పరిజ్ఞానం ఉందో అది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తుందో దాన్ని ఎక్కువ ఫోకస్ చేసే విధంగా మనందరం కూడా అందరం కూడా కార్యకర్తలుగా ఉండాలి అని తెలియజేశారు.
మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ మాట్లాడుతూ….. మీ అందరికి తెలుసు పేస్ బుక్, ట్విటర్, ఇంస్తాగ్రం, వాట్స్ యాప్, అన్నిటిలో ఎకౌంటు ఉండటమే గర్వంగా భావిస్తున్నాము. ఎవరిదగ్గరైన లేదు అంటే ఎందుకు లేదు మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. లింక్ లు వచ్చిన వాటిని ఓపెన్ చెయాలా లేదా అనేది మన చేతులలోనే ఉంది దయచేసి మనకున్న ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏదైతే ఉందో అది మన లైఫ్ ని ఈజీ చేయడానికి ఉంది కాని దుర్వినియోగం చేయడానికి చాల మంది చూస్తున్నారు. ఇది ఒక రెస్పాన్సిబుల్గా ఈ ఇంటర్నెట్ ప్లాట్ ఫామ్ ని వాడుతామని ఈరోజు ఓత్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నేపధ్యంలో ఈ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలియజేసినారు.
ఈస్ట్ ఎం.ఎల్.ఎ. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ… సైబర్ క్రైమ్ ప్రతి రోజు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వింటూ ఉంటాం, ఫోన్ లో మాట్లాడుతూనే డబ్బులు పోగొట్టుకుంటున్నారు, స్మార్ట్ ఫోన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే సమయంలో అనేకరకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది కావున ప్రతి విషయంలో అవగాహన కలిగి ఉండాలి, ఇవాళ చాలా మంచి కార్యక్రమం మన సి.పి. చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది డబ్బులు పోగొట్టుకున్నవారు ఉన్నారు, దానికి ముగింపు పలుకుతామో లేదోగాని ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తే కొంతవరకు వాటిని అడ్డుకోవచ్చని, ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు పది మందికి దీనిపై అవగాహన కల్పించాలి తెలియజేసారు.
సెంట్రల్ ఎం.ఎల్.ఎ. బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ….. చాలా సంతోషం ఈ రోజు ఒక మంచి కార్యక్రమం విజయవాడ పోలీస్ కమీషనర్ ముందుకు తీసుకు వచ్చినందుకు, ఫిర్యాదు వచ్చిన తరువాత పరిష్కరించేకన్నా ఫిర్యాదులు రాకుండా ప్రజలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు సైబర్ సోల్జర్స్ అని కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులను నియమించడం, వీరందరూ కూడా వారి చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించడం వలన కొంతవరకు సైబర్ నేరాలను నివారించవచ్చు అని, అవగాహన వలన ప్రజల్లో చైతన్యం వచ్చి చాలా వరకు సైబర్ నేరాలు తగ్గుతాయి అని తెలియజేసినారు.
అనంతరం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2500 మందితో వాక్తాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్., ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, కే.చక్రవర్తి ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, అధికారులు, సిబ్బంది మరియు 2000 మంది సైబర్ సోల్జర్స్ పాల్గొన్నారు.