-జిల్లాలో విచ్చలవిడిగా బాలల హక్కుల ఉల్లంఘనలు..
-ప్రభుత్వ సెలవు దినాల్లో యధేచ్చగా విద్యా సంస్థల నిర్వహణ..
-గాఢ నిద్రమత్తులో జిల్లా విద్యా శాఖ అధికారులు..
-విద్యార్థుల సమస్యలపై కనీసం ఫోన్ లకు కూడా స్పందన కానీ ఎన్టీఆర్ ఇంటర్ బోర్డు (ఆర్.ఐ.ఒ.)అధికారి..
-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు ప్రభుత్వ సెలవు దినం అయిన రెండవ శనివారం (సెకండ్ సాటర్డే) నాడు నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యాశాఖ నియమనిబంధనలను ఉల్లంఘించి యదేచ్చగా పాఠశాలల్లో కళాశాలల్లో ప్రత్యేక తరగతులను పరీక్షలను నిర్వహించడం జరిగిందని అలా తరగతులను పరీక్షలను నిర్వహించే చైతన్య, నారాయణ, ఎన్.ఆర్.ఐ. జూనియర్ కళాశాలలను మరియు చైతన్య, నారాయణ, శ్రీరామ్, శుభోదయ, సెంటన్స్, విజ్ఞాన్ విహార్, శ్రీసాయి టాలెంట్ స్కూల్లను అడ్డుకొని విద్యార్థులను విద్యా సంస్థల నుండి ఇళ్లకు పంపించేయడం జరిగిందనీ.. ఇప్పటికైనా ప్రభుత్వ సెలవు దినాలలో ట్యూషన్ల పేరుతో కోచింగ్ ల పేరుతో పరీక్షల పేరుతో విద్యార్థులకు మానసికంగానూ శారీరకంగానూ విశ్రాంతి లేకుండా ఒత్తిడి చదువులను చదివిస్తున్న విద్యాసంస్థలపై వాటి నిర్వాహక యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనది.