విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ముందుండాలని భారత దేశం విద్య వైద్య అవస్థాపన మరియు సాంకేతిక రంగాలలో ముందుండాలని యువత ముఖ్య పాత్ర పోషించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాద్రశ్ పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్యం గా ఈ రోజు కళాశాల విద్యార్థినులు LEPL INOX థియేటర్ ప్రాంగణం లో డ్రగ్స్ వాడటం మంచిది కాదు అని తద్వారా యువత అనారోగ్యం బారిన పడుతున్నారని భవి భారత పౌరులైన యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని విజయవాడ లోని ప్రజలకు సందేశం ఇవ్వటం కోసం ఎర్పాటు చేశామని sub.leatuent స్వప్న తెలిపారు. కెప్టెన్ శైలజ విద్యార్థినులతో డ్రగ్స్ కు బానిస కారాదని వాటి వాడకం వల్ల ఒత్తిడి మానసిక శరీరం పరమైన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే సందేశాత్మక స్కిట్ ను ఫ్లాష్ మొబ్ ను చేయించారు. 25 మంది డిగ్రీ స్టూడెంట్స్ మరియు NCC cadets ఫ్లాష్ మోబ్ లో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …