రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి వనిత ప్రారంభించారు. స్థానిక ఇన్నీస్ పేట సమీపంలో ఉన్న సబ్ జైలు ఆవరణ లో ఏపి ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చెయ్యడం జరిగిందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జైళ్ళ శాఖ ద్వారా పెట్రోల్ కంపెనీలు ఆద్వర్యంలో పెట్రోల్ బంకు లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోం మంత్రి వినియోగదారుని వాహనానికి స్వయంగా వాహనానికి పెట్రోల్ పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డి.ఐ.జి. ఆఫ్ ప్రిజన్స్ ఎం ఆర్ రవి కిరణ్, ఐ జి ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ ఐ. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …