గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగర మేయర్, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా మెరుగుదల చేయడం అధిక ప్రాధాన్యతగా కృషి చేస్తామన్నారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా, అదనపు కమిషనర్ గా విధులు నిర్వహించడం వలన నగరంపై సమగ్ర అవగాహన ఉందన్నారు. నగరపాలక సంస్థకు అధిక మొత్తంలో ఆస్తి పన్ను బకాయి ఉన్నమొండి బకాయిదార్ల నుండి పన్ను వసూళ్లు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తామని, నగరాభివృద్ధికి ఆదాయ వనరుల పెంపు, ఉన్న వనరులను సద్వినియోగం చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన పుర సేవలు, స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నగర అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగిన విధంగా అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, అధికారులు, ఉద్యోగులు కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, శాలువాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకటకృష్ణయ్య, డి.వెంకట లక్ష్మీ, యస్.ఈ. ఎం.శ్యాం సుందర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …