అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం.డీ(మేనేజింగ్ డైరెక్టర్) దినేష్ కుమార్,ఐఏఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను మంత్రికి అందించికి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి దినేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ను తన జేబు సంస్థగా వాడుకుని, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెట్టిన ఉద్దేశాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చి, ఆ ప్రయోజనాలను ప్రజలకు అందేలా కృషి చేయాలని కోరారు. ఏపీఎస్ఎఫ్ఎల్ ను తిరిగి గాడిన పెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని దినేష్ కుమార్ మంత్రికి తెలిపారు.
Tags amaravathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …