అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని పేదరిక నిర్మూలకు ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాలు పూర్తిగా క్షేత్ర స్థాయిలోని పేదలందరికీ అందినపుడే సమ సమాజ స్థాపనకు అవకాశం కులుగుందని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈసందర్భంగా చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈనాడు మనం స్వేచ్ఛాగా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నామంటే దానికి కారణం దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు అనేక పోరాటాలు చేసిన స్వాతంత్ర్యం సాధించిన త్యాగధనుల కృషి ఫలితమేనని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 78 వసంతాలు పూర్తయినా నేటికీ సమాజంలోని అసమానతలు పూర్తిగా తొలగలేదని అన్నారు.200 సంవత్సరాలకు పైగా పరాయి పాలనలో మగ్గిన మన దేశం స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు హక్కులు కల్పించబడి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక రకాల పధకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగు తోందన్నారు. అయినప్పటికీ నేటికీ సమాజంలో అసమానతలు పూర్తిగా తొలగిపోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అమలుచేసే అన్ని అభివృద్ధి సంక్షేమ పధకాలు పూర్తి స్థాయిలో అర్హలైన ప్రతి పేదవారికి అందాలని అప్పుడే పేదరిక నిర్మూలనతో పాటు సమ సమాజ స్థాపనకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.ఈనాటికీ సమాజంలో అసమానతలు,పేదరికం రూపు మాపలేదంటే అందుకు గల కారణాలను ఇటు పాలకులు,అటు ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ మోషేన్ రాజు చెప్పారు.
దేశంలో అనేక మతాలు,కులాలు,భాషలు కలిగి భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన మన దేశంలో అన్న మతాలు,ప్రాంతాలు,భాషలు కలవారు సుఖసంతోషాలతో ఉండ గలుగు తున్నామంటే అందుకు గల కారణం మన రాజ్యాంగ స్పూర్తే కారణమని మోషేన్ రాజు పేర్కొన్నారు.నేడు దేశంలో ఏప్రాంతంలోనైనా ఏచిన్న సంఘటన జరిగినా కులమతాలకు అతీతంగా అందరం స్పందిస్తున్నామంటే అందుకు కారణం మన రాజ్యాంగ స్పూర్తే నని చైర్మన్ మోషేన్ రాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్,ఉప కార్యదర్శులు పివి సుబ్బారెడ్డి, రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …