న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించారు. కాగా, ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై ఆమెతో చర్చించారు. సత్వరమే నిధుల విడుదల జరిగేలా చూడాలని కోరారు. నిర్మలాతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు… అక్కడే ఉన్న కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్ సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
Tags delhi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …