-ఘనం వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఆలయ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశాల్లో స్థిరపడిన ఉద్యోగులు సొంత గ్రామాభివృద్ది కి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలం పెద ఓగిరాల లో వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎం.పి. కేశినేని శివనాథ్ సోమవారం పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఎంపి కేశినేని శివనాథ్ కు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలో ఎంపికేశినేని శివనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహా ప్రతిష్ట సందర్బంగా ఆలయంలో నిర్వహించిన హోమగుండానికి ఎంపి కేశినేని శివనాథ్ పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన దొంతి రెడ్డి లక్ష్మారెడ్డి, భీమవరం పరమేశ్వర రెడ్డి లకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ వెంకన్న, సాయి బాబా ఆశీస్సులు వుండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.