ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తాం… : బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపిఎస్ ఆర్టీసీ లో పేరుకుపోయిన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్ధితి గత అయిదు సంవత్సరాలు గా ఇదే స్ధితి కొనసాగిందని ఆర్టీసీ యూనియన్ నేతలు బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు ముందు వాపోయారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి వారధిలో విష్ణుకుమార్ రాజు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసి లో ని వివిధ హోదాలకు సంబందించిన యూనియన్ నేతలు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. ఆర్టీసి డ్రైవర్లు ఈ టిక్కెట్ మిషన్ లు నాణ్యత లేవని వాటికి సమస్య వస్తే డ్రైవర్ లపై అధికారులు వేధిస్తారని అదేవిధంగా నాణ్యత లేని మిషన్లు ద్వారా వినియోగించడం, రెంట్ కు తీసుకు వస్తున్న మిషన్లు ఈవిధంగా అనేక సమస్యలు ఉత్పన్న అవుతున్నాయని అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్ధితి దయనీయమన్నారు. గ్యారెజీల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలు అనేకం ఉన్నాయని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాస రావు విష్ణుకుమార్ రాజు ద్రుష్టికి తీసుకుని వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి గ్యారేజీల్లో 40 శాతం అవుట్ సోర్సింగ్ ఉద్యుగులేనని శాశ్వత ప్రాతిపదికన ఉధ్యోగులను నియమాంచాలని కోరారు. ఆర్టీసి ఉద్యోగుల విషయంలో ఇహెఛ్ఎస్ నుండి మినహాయించి ఎపిఎస్ ఆర్టీసీలో ఉన్న పాత వైధ్యవిధానాన్ని అమలు చేయాలని కోరారు. పులివెందులకు చెందిన కల్లూరి ప్రతాపరెడ్డి భార్యకు కాళ్ల వాపుల వ్యాధి వస్తే 8 ఎకరాలు అమ్మి వైద్యం చేయించుకున్నా నయం కాలేదు, ఆరోగ్యశ్రీలో ఈ వ్యాది లేదని చెబుతున్నారని ప్రతాప రెడ్డి వాపోతే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతాప రెడ్డిని ఓదార్చి ఎయిమ్స్ లో ఉచితంగా వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
బాపట్ల లో అన్నదమ్ముల మద్య ఆస్ధి వివాదానికి సంబందించిన విషయం కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో మాట్లాడి పరిష్కారానికి క్రుషి చేస్తానన్నారు. వైసీపి ప్రభుత్వంలొ మూతపడిన ఆయుష్ డిస్పెన్సరీలు 451 పునరుద్దరించాలని బద్వేలుకు చెందిన సురేష్ ఎమ్మెల్యేకు వివరించారు ఈ విధంగా అనేక ఫిర్యాదులను విష్ణుకుమార్ రాజు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఆర్టీసి కి సంబందించిన సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ద్రుష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి క్రుషి చేస్తానన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, బిజెపి సీనియర్ నేత పైడి వేణుగోపాల్ , వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *