అర్హత ఉన్న ప్రతి వారికి వితంతు పెన్షన్ అందాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు ది. 21-8-2024: నిర్దేశిత ధృవ పత్రాలు కల్గిన ప్రతి ఒక్కరికీ వితంతు పించన్ అందుతుందని, వితంతు పిందన్ దరఖాస్తుదార్లు పించన్ కోసం తగిన ధృవ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి టి. లీలావతి గారు తెలిపారు. బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు నగరంలో వితంతు పెన్షన్ లు మంజూరు కాని అర్జీదారులతో, అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన శిబిరం జరిగింది.
ఈ సందర్భంగా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి టి. లీలావతి గారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో షుమారు 6 వందల మంది వితంతు పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారు తప్పనిసరిగా తమ భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా దరఖాస్తు చేయాలన్నారు. నిర్దేశిత ధృవ పత్రాలు అర్జీకి జత చేయకపొతే పెన్షన్ మంజూరు కాదన్నారు. కనుక వితంతు పించన్ కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ తొలుత తమ భర్త మరణ ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నారు. పట్టణ పరిధిలో అయితే నెలకు రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతం అయితే నెలకు రూ.10 వేల లోపు ఆదాయం కల్గి ఉండి, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారు, అన్ని ధృవ పత్రాలు అర్టీతో పాటు జత చేసి జిల్లా కోర్ట్ ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యాలయంలో అందించినా సంబందిత అధికారులకు పంపి పెన్సన్ మంజూరుకు సహకరిస్తామని తెలిపారు. అలాగే ఒంటరి మహిళలు కూడా పెన్సస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కొన్నిసార్లు రోడ్ ప్రమాదం జరిగిన సమయంలో ఏ వాహనం ద్వారా జరిగిందో కూడా తెలియకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి ఎఫ్ఐఆర్ కాపీతో తహసిల్దార్ కి అర్జీ అందిస్తే తీవ్ర గాయాలు జరిగిన వారికి 2 నెలల్లో రూ.50 వేలు, మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు అందించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇష్టానుసారం ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని, ప్రస్తుత చట్టాల ప్రకారం మైనర్లు బైక్ లు నడిపినా, ప్రమాదాలు చేసినా వారితో పాటు వారి తల్లిదండ్రులలకు కూడా శిక్షలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో 15 నుండి 17 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఫోక్సో చట్టం ప్రకారం అటువంటి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్ లు ఇచ్చి వదిలి వేయకుండా, వారితో ఎక్కువ సమయం గడపాలన్నారు.
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె. రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థలోని 206 వార్డ్ సచివాలయాల పరిధిలో 6 వందల వితంతు పెన్సన్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిలో ఎక్కువ శాతం క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేశామని తెలిపారు. వితంతు పెన్సన్ మంజూరుకు తప్పనిసరిగా నిర్దేశిత ధృవ పత్రాలు ఉండాలన్నారు. నగర పరిధిలో ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకుంటే స్థానిక వార్డ్ సచివాలయంలో అర్జీలు అందించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డి.వెంకట లక్ష్మీ, న్యాయ సేవాదికార సంస్థ ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, జిఎంసి ఉపా సెల్ పిఓ వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *