విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైల్డ్ వికాస్ పౌండేషన్ వారి ఆద్వర్యంలో యల్.బి.యస్ నగర్ నందుగల పుచ్చలపల్లి సుందరయ్య నగర పాలక ఉన్నత పాఠశాల విధ్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య రక్షణ కొరకు చైల్డ్ వికాస్ పౌండేషన్ ను స్థాపించి దాతల ద్వారా దీర్గకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకు సహకారాన్ని అందిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు 140 మంది విధ్యార్దులకు కంటి పరీక్షలను నిర్వహించామని ఆయన అన్నారు. వీరిలో దృష్టిలోపం ఉన్న 48 మందికి సంస్దతరపున ఉచితంగా కళ్ళజోళ్ళను అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్టోమెట్రిస్ట్ ఫిరోజ్ బాషా, ప్రధాన ఉపాద్యాయులు హుస్సేన్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …