విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మండలి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రాంగణంలో మహిళలకు 50 హైస్పీడ్ కుట్టు మరియు వాసన్య మహిళా వాసవ్య మహిళా మండలి మిషన్ల ఉచితంగా ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రొటెరియన్ డాక్టర్ యం. వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియా లిమిటెడ్ వారు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి (సి.యస్.ఆర్) లో బాగంగా విద్య, ఆరోగ్యం. ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలెప్మెంట్, క్రీడలు, లైవీ హుడ్స్, పర్యావరణ సుస్థిరత అంశాలలో సేవలను అందిస్తుందని అందులో భాగంగా మహిళలు ఆర్చికంగా ఎదగడానికి టైలరింగ్ ఎంతో ఉపయోగ పడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరువుకోవాలని ఆయన పిలుపు అన్నారు. అనంతరం ఐ.పి.డి.జి సుబ్బారావు రావురి (దత్తా) మాట్లాడుతూ ఈ హై స్పీడ్ మెషిన్లపై మెలకువలను పదిరోజుల శిక్షణను మహిళలు పూర్తి చేసారని ఆయన అన్నారు. ఈ మిషన్లను ఉచితంగా ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కుటుంబం ఆర్ధికంగా ఎదుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మేము ఇదివరకి పెద్ద పెద్ద కర్మాగారాలతో మంచి సంబందాలు ఉన్నాయి కావునవాల్లకు కావలసిన రీతిగా మీరు దుస్తులను కుట్టి ఇవ్వగలిగితే అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారని ఆయన అన్నారు. ఆర్ధికంగా మొదట మీరు, మీ కుటుంబం అభివృద్ధి చెందిన తర్వాత ఇతరులకు కూడా మీరు ఉపాది అవకాశాలను కల్పించేదిశగా మీరు ముందుకు వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం వాసన్య మహిళా మడలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ ఈ ఉచిత కుట్టుమిషన్లను మహిళలకు అందించే మంచికార్యక్రమాన్ని వాసవ్య లో శిక్షణ పొందిన మహిళలకి ఇవ్వడానికి ముందుకు వచ్చిన కోల్ ఇండియా లిమిటెడ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రతీ మహిళ. కుటుంబానికి వెన్నెముక కావున ప్రస్తుతమున్న పరిస్థితులలో ఒక్కరు తెచ్చిన దానితో పిల్లల చదువు, కుటుంబఅవసరాలు తీరడం కష్టం కావున ఇద్దరూ ఏదోఒక పని చేయవలసిన పరిస్థితి ఉంది, మీరు చేసే పనిలో నాణ్యత, నూతన విధానాలను కాలానికి అనుగుణంగా వినియోగదారులకు దుస్తులను ఇవ్వగలిగినప్పుడు వ్యాపారం లో అధిక లాబాలను మీరు చూస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వి.శ్రీదేవి, అధ్యక్ష్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, వాసవ్య సిబ్బంది కూన శివయ్య, యం.వరలక్ష్మి, చైతన్య పాల్గొన్నారు.