క్షేత్రస్థాయి నుంచి బిజెపి బలోపేతమే లక్ష్యం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం గొల్లపూడి లోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి శ్రేణులకు సభ్యత్వ నమోదు కార్యాశాల పై అవగాహన కల్పించారు. మొదటగా భరతమాత చిత్రపటానికి దీన్ దయాల్ ముఖర్జీ, శ్యాం ప్రసాద్ ముఖర్జీల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి బిజెపి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన బిజెపి సభ్యత్వం పునరుద్ధరించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్నారు. వికసిత్ భారత్@2047 ‘ నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనేది ప్రధాని మోడీ సంకల్పం అన్నారు. బిజెపి భావజాలాన్ని, సిద్ధాంతాలను, వికసిత్ భారత్ లక్ష్యానికి ప్రజలను అనుసంధానం చేయాలన్నారు. ఇందుకు జాతీయస్థాయి నుంచి ప్రతి నగరం, గ్రామం, బూత్, స్థాయి వరకు పార్టీని విస్తరించాలన్నారు. టిడిపి, జనసేన, బిజెపి, కూటమి సహకారంతో తనకి పశ్చిమ నియోజకవర్గంలో47 వేల పైచిలుకు మెజారిటీ వచ్చిందని తమకి ఓటు వేయని వారిని కూడా ఆకర్షించి సమాజంలో ప్రతి వర్గాన్ని అక్కున చేర్చుకుంటానన్నారు. ప్రత్యర్థిని శత్రువుగా చూడబోమని ప్రత్యర్థులందరూ తమకు మిత్రులేనన్నారు. ప్రత్యర్ధుల మన్ననలు పొందేందుకు ప్రజా సేవకుడిగా నిరంతరం పాటు పడతానని తెలియజేశారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని మహిళలందరికీ భారతీయ జనతా పార్టీలో సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్డీయే కూటమితో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు.ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణం లో కార్యాశాల సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యుడు బాధ్యతగా తీసుకొని లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలన్నారు. బిజెపి ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతంతో కార్యకర్తల బలంతో ముందుకు వెళుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సిద్ధాంతంతో అందరం ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, రాజమండ్రి ఇంచార్జ్ భగవాన్, మైలవరం అసెంబ్లీ కన్వీనర్ నూతలపాటి బాల కోటేశ్వరరావు, మీడియా కన్వీనర్ పాతూరి నాగభూషణం, మువ్వల వెంకటసుబ్బయ్య, శ్రీనివాస్ రాజు, కిలారు దిలీప్, ఆర్ముగం, బోగవల్లి శ్రీధర్, శ్రీకాంత్, పైలా సోమి నాయుడు, బబ్బూరి శ్రీరామ్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *