-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణతత్వం ఆచరణీయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన పాల్గొని స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోకులాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీ కృష్ణుని జన్మదినానికి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చిన్న వయస్సులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్ధంగా పఠించడం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ఉత్తమ జీవన విధానానికి భగవద్గీత స్ఫూర్తినిస్తుందని.. మానవుడు పరమార్థాన్ని గీతాసారం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కనుక ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా రోజుకో పేజీ అయిన భగవద్గీత చదవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.