ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి…

-మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలి
-పరిష్కరించిన ఫిర్యాదులు మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ఒకటవ తేదీన ఉదయం 6 గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని, పరిష్కరించలేనిచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా, నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరల రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని, పరిష్కరించలేని ఫిర్యాదు ఐనచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని, వారితో మాట్లాడాలని తెలిపారు.అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని, ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని, నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి, రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారులని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు. కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీ ఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ అయిన తర్వాత కొంత సమయం ఈ అంశంపై సమీక్ష ఉంటుందని తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ ల పంపిణీ ఆగస్ట్ నెలకు చెందిన పెన్షన్లను వచ్చే నెల సెప్టెంబర్1 న ఆదివారం పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఎట్టి పరస్థితుల్లోనూ ఉదయం 6 గం. నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని, పలు సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారికి గట్టిగా హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ మొదటి రోజునే పూర్తి స్థాయిలో వంద శాతం పంపిణీకి ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్,ఇతర మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీఓ లు, గ్రామ వార్డు సచివాలయ అధికారిణి సుశీల దేవి, డిప్యూటీ సీఈఓ ఆదిసేశా రెడ్డి, పిడి డిఆర్డీఎ ప్రభావతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *