గురువారం 10 గంటలకి 3 కే ర్యాలీ

-జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాల్గొననున్న జిల్లా కలెక్టరు తదితరులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక బొమ్మూరు జిఎంఆర్ పాలిటెక్నిక్ మైదానంలో దివ్యాంగుల వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని జిల్లా స్పోర్ట్స్ అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు. బుధవారం స్థానిక జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 3 కే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా బుధవారం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వీల్ చైర్ క్రికెట్ టోర్నీ , స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థినులతో ఫన్ గేమ్స్ నిర్వహించామని తెలిపారు. అందులో భాగంగా రిలే గేమ్స్ , సంప్రదాయ ఏడు పెంకుల ఆట, తాడులాగే ఆట, బాస్కెట్బాల్ షూట్ అవుట్, బాల్ పాసింగ్ గేమ్ తదితర క్రీడలను నిర్వహించామన్నారు. ఈ క్రీడలలో విద్య యువత ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ నుండి గోదావరీ గట్టు ప్రాంతంలోని ఇస్కాన్ టెంపుల్ వరకు 3 కే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఎస్పి , విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *