Breaking News

అరుదైన గౌరవం

-డాక్టర్ రఘు రామ్‌కి లభించిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ గౌరవ ఫెలోషిప్ –
-122 సంవత్సరాల చరిత్రలో భారత ఉపఖండం నుండి ఈ ప్రతిష్టాత్మక సర్జికల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడు, మొదటి & ఏకైక సర్జన్
-ఈ గుర్తింపును తన తల్లి & మాతృభూమికి అంకితం చేసిన డాక్టర్ రఘు రామ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ రఘు రామ్ పిల్లరిశెట్టి, కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ నేడు అరుదైన & అద్వితీయమైన విశిష్టతను సాధించారు. ఆయన తన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ (ISS) గౌరవ ఫెలోషిప్‌ను రాయల్ హైనెస్ తువాంకు ముహ్రిజ్ ద్వారా పొందారు. ముహ్రిజ్ పశ్చిమ మలేషియాలోని రాష్ట్రంలోని నెగ్రి సెంబిలాన్ రాజకుటుంబానికి చెందిన విశిష్ట సభ్యుడు మరియు ప్రధాన పాలకుడు.

ఈ ప్రతిష్టాత్మక సంస్థ యొక్క 122 సంవత్సరాల చరిత్రలో ఈ అరుదైన గౌరవాన్ని భారత ఉపఖండం నుండి అందుకున్న అతి పిన్న వయస్కుడు, మొదటి & ఏకైక సర్జన్ డాక్టర్ రఘు రామ్ కావడం విశేషం. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద మలేషియాకు చెందిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ & కాలేజ్ ఆఫ్ సర్జియన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న 50వ ప్రపంచ గోల్డెన్ జూబ్లీ వరల్డ్‌ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ ప్రారంభ వేడుకల వేదికగా ఆయన ఈ అత్యధిక గుర్తింపుని అందుకున్నారు. ఆగస్టు 26 నుంచి 29 వరకు జరిగే ఈ 4 రోజుల వైజ్ఞానిక మహోత్సవంలో 30కి పైగా దేశాలకు చెందిన 1500 మంది సర్జన్లు పాల్గొంటున్నారు. 1902లో స్థాపించబడిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శస్త్రచికిత్స సంస్థల్లో ఒకటి మరియు ఇందులో సభ్యులుగా ప్రపంచవ్యాప్తంగా విశిష్టమైన సర్జన్లను కలిగి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో ఇద్దరు సర్జన్లు అయిన- అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఎర్నెస్ట్ జీనీ మూరె మరియు జపాన్‌కి చెందిన ప్రొఫెసర్ అకిరా మియౌచిలతో కలిసి డాక్టర్ రఘురామ్ ఈ అరుదైన అవార్డుని అందుకున్నారు.
రిఫరెన్స్; గత 122 (1902-2023) ఏళ్లుగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ అందిస్తున్న ఈ గౌరవప్రదమైన అవార్డు అందుకున్న ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సర్జన్లకు లింక్ https://www.iss-sic.com/honorary-fellow-full-listing
‘‘ఈ అరుదైన గుర్తింపు పొందినందుకు మీకు మా అభినందనలు. భారతదేశంలో బ్రెస్ట్ సర్జరీకి సంబంధించిన ఆర్ట్ మరియ సైన్స్‌ని అభివృద్ధి చేయడానికి మీరు చేస్తోన్న కృషి చాలా గొప్పది. మీ జీవితకాలంలో చేస్తోన్న ఈ కృషి, ప్రయత్నాలు నిజంగా అభినందనీయం. అందుకే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీ మీకు ఈ అరుదైన గౌరవ సభ్యత్వాన్ని అందిస్తోంది.’’ అంటూ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీకి చెందిన ప్రొఫెసర్ చెంగ్ హర్, అధ్యక్షుడు మరియు ప్రొఫెసర్ కెన్ బొఫర్డ్, సెక్రటరీ జనరల్ వారు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆనందోత్సాహాలతో కూడుకున్న సందర్భం గురించి డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ- ‘‘రాజకుటింబీకులు, గౌరవనీయులు అయిన తువాంకు ముహ్రిజ్ నుంచి ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా కృతజ్నుడిని. ఇప్పటికీ నాకు ఈ అరుదైన గౌరవం లభించిందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఈ అద్భుతమైన క్షణం మరియు అరుదైన గౌరవాన్ని నేను నా మాతృభూమికి, నా కుటుంబానికి, అలాగే వారి సంరక్షణలో పాలుపంచుకునే ప్రత్యేక అవకాశాన్ని నాకు కలిగించిన రోగులకు కూడా అంకితం చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు వారి సహాయసహకారాలు అందించిన నా సన్నిహితులు, స్నేహితులు, కొలీగ్స్ మరయు భారత ప్రభుత్వానికి నా కృతజ్నతలు. వారికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ అత్యున్నత గౌరవం నా మాతృభూమి- భారత్‌లో రొమ్ము ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపరచాలని, మరింత గొప్పగా ప్రభావాన్ని చూపాలనే కాంక్షని మరింతగా రగిలించింది.

ప్రపంచ ప్రఖ్యాత శస్త్ర వైద్యుడు, ప్రతిష్టాత్మకమైన పిన్న వయస్కుల్లో ఒకరైన పద్మశ్రీ మరియు వరుసగా 2015, 2016 డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించిన డాక్టర్ రఘురామ్ ఇప్పుడు శస్త్రచికిత్స వృత్తిలో కొత్త శిఖరాలను చేరుకుని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

అతి చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత సర్జికల్ ఆర్గనైజేషన్స్ నుంచి అనేక గౌరవ ఫెలోషిప్‌లు ఆయన వద్దకు వరుసకట్టాయి. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ- ఇదొక విశిష్ట అకడమిక్ ట్రాక్ రికార్డ్ అని చెప్పుకొచ్చారు. అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ నుంచి ఫెలోషిప్ (2024) పొందిన గౌరవనీయులుగా రఘురామ్ తనదైన ముద్ర వేశారు. ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లండ్ (2022) నుండి ఎఫ్ఆర్‌సీఎస్ గౌరవం, ది అసోసియేషన్ ఆఫ్ సర్జియన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండ్ (2021), కాలేజ్ ఆఫ్ సర్జియన్స్ ఆఫ్ శ్రీలంక (2020) మరియు చైనీస్ కాలేజ్ ఆఫ్ సర్జియన్స్ (2020) నుంచి గౌరవ ఫెలోషిప్; అలాగే ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జియన్స్ ఆఫ్ థాయ్‌లాండ్ (2019) నుంచి గౌరవ ఎఫ్ఈర్‌సీఎస్ అందుకున్నారు డాక్టర్ రఘురామ్.

మాతృభూమి పట్ల ఆయనకు గల ప్రేమ మరియు సామాజిక సేవ పట్ల ఆయనకు ఉన్న మక్కువలే ఆయన ట్రేడ్‌మార్క్‌లు. చాలామంది జీవితకాలంలో సాధించలేనిది చాలా చిన్న వయసులోనే ఆయన సాధించారు. ముఖ్యంగా భారతదేశంలో గత 17 సంవత్సరాలుగా అనేక వినూత్నమైన పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ సంబంధిత వ్యాధులు మరియు సంరక్షణ గురించి ఆయన ఉద్యమం చేస్తున్నారు. దక్షిణాసియాలోనే మొదటి సమగ్ర రొమ్ము ఆరోగ్య కేంద్రం మరియు స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దేశవ్యాప్తంగా వ్యాధి పై అవగాహన పెంచేందుకు ఫౌండేషన్‌ని సైతం నెలకొల్పారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాల్లో అతిపెద్ద జనాభా ఆధారిత స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్- ఈ కార్యక్రమం ప్రస్తుతం దేశమంతటా విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమాల అమలు, విస్తరణలో కీలక పాత్ర పోషించింది ఆయనే. అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలోనూ ఈయన పాత్ర చాలా కీలకం అని చెప్పచ్చు. ఇది భారతదేశంలో బ్రెస్ట్ సర్జరీని అభ్యసిస్తున్న సర్జన్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ. దక్షిణాసియాలోనే మొట్టమొదటి మరియు ఏకైక అసోసియేషన్ ఇదే కావడం విశేషం. భారత ప్రధాన మంత్రి మోదీ ప్రేరణ అయిన డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రపంచంలోనే మొట్టమొదటి రొమ్ము ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్ మరియు సాధారణంగా మాట్లాడే 11 భారతీయ భాషలలో మొబైల్ ఫోన్ యాప్ మహిళలందరూ ఉపయోగించడానికి వీలుగా రూపొందించారు. ముందస్తుగా రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించడం యొక్క ప్రాముఖ్యత గురించి దేశానికి మరింత అవగాహన పెంచడం ఈ యాప్ యొక్క ఉద్దేశ్యం. అలాగే ‘నిషిద్ధం’ అని పరిగణించబడే కొన్ని అంశాల గురించి కూడా ఇది చర్చిస్తుంది. భారతదేశంలో ఇప్పటివరకు వేలాదిమంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని (ఇబ్రహింపూర్) ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకుని తన వ్యక్తిగత దాతృత్వం ద్వారా అక్కడున్నవారి జీవితాన్ని మార్చే పరికరాలు మరియు సౌకర్యాలను అందించారు. దీని ద్వారా ఆయనకు స్థానిక, ప్రాంతీయ మరియు జాతీయ అవార్డులతో గుర్తింపు లభించిన విషయం మనకు తెలిసిందే.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *