-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం నగర పరిధిలోని 45వ సానిటరీ డివిజన్ ఏరియాలో రోటరీ నగర దగ్గర గల ఐరన్ స్క్రాప్ వ్యాపారస్తులకి రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో నోటీసి ఇచ్చి ట్రేడ్ లైసెన్స్ తీసుకోమని అనేక పర్యాయములు చెప్పినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకొని కారణంగా కరీముల్లా ఐరన్ స్క్రాప్ బిజినెస్ వారికి ద్వారకా వీధిలో గల నేత్ర ఎంటర్ప్రైజెస్ డిస్పోజల్ షాపు వారికి చట్ట ప్రకారము సీళ్ళు వేయడం జరిగినది. నగరంలో గల వ్యాపారస్తులు ఎవరికైతే ట్రేడ్ లైసెన్సులు లేవో వారు సంబంధించిన సచివాలయం నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా అందరికీ తెలియజేయడమైనది కమిషనర్ గారి ఆదేశాలు ప్రకారం లైసెన్స్ లేని వ్యాపారస్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడు నని, అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా వాటర్ బోర్న్ డిసీజెస్ డయేరియా, వాంతులు విరోచనాలు జరుగుతున్న కారణంగా నగరంలో గల ఆర్వో ప్లాంట్స్ అన్ని వారి ద్వారా అమ్మకము జరుగుతున్న నీటిని ప్రతి నెల గవర్నమెంట్ వారి ల్యాబ్ నందు తనిఖీ చేయించి రిపోర్టు సమర్పించవలసినదిగా నోటీసులు జారీ చేసిన కానీ కొంతమంది ఇంకా ఆరో ప్లాంట్ నందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని కారణంగా వారి పైన కూడా చర్యలు తీసుకోబడునని కమిషనర్ అన్నారు.