Breaking News

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగ పరచరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించుటకు మాత్రమే వినియోగించాలని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ PC&NDT డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియెట్ అథారిటీ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీస్ అధికారులు అదనపు తదితర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేయరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించుటకు మాత్రమే వినియోగించాలని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (నిబంధన మరియు దుర్వినియోగం నివారణ) నియమాలు 1994, 1996 మేరకు ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (లైంగిక ఎంపిక నిషేధం) చట్టం పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. డి ఎం హెచ్ ఓ వివరిస్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విన్స్ ఎన్జీఓ మాట్లాడుతూ ఆడ పిల్లలపై చిన్న చూపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ డిఎంహెచ్ఓ శ్రీహరి,అదనపు ఎస్పీ వెంకట్రావు, విన్స్ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు మీరా, పోలీస్ మెడికల్ ఆఫీసర్ మాధురి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *