Breaking News

తిరుపతి సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరువలేనివి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరువలేనివని, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన సుధాకర్ శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య మాట్లాడుతూ నేడు పదవీ విరమణ చేసిన రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ సమాచార శాఖలో ఎనలేని సేవలు చేశారని తెలిపారు. సుమారు 32 సంవత్సరాలు సుదీర్ఘoగా సమాచార శాఖలో పనిచేసిన సుధాకర్ ముందు చూపుతో అధికారి అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ప్రతిరోజు తిరుపతి జిల్లాలో వివిఐపి, వీఐపీల పర్యటనల నేపథ్యంలో పేపర్ క్లిప్పింగ్స్ సమయానుకూలంగా అందించడం, మీడియాతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర చక్కగా నిర్వర్తించారు అని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే వారని కొనియాడారు.

సమాచార శాఖ రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్లు చంగల్ రెడ్డి, జయలక్ష్మి లు మాట్లాడుతూ… 32 ఏళ్ల సర్వీస్ కాలంలో రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ ప్రతి అధికారి దగ్గర మన్ననల్ని పొందడంతో తన తోటి సిబ్బంది అందరితో స్నేహభావంతో ఉండి సమన్వయంతో కలిసి పోయి విధులు నిర్వర్తించే వారని తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాలను ఎన్నడూ గౌరవించే వారని, ఏ పని అప్పగించినా వాటిని సమర్థవంతంగా నిర్వహించేవారని పేర్కొన్నారు.

జిల్లా సమాచార అధికారులు పురుషోత్తం, వెంకటరమణ మాట్లాడుతూ… పదవీ విరమణ చేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ తమకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, వారి దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, శాఖా పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహ సంబంధాలు కలవని తెలిపారు.

పదవీ విరమణ చేసిన రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ… అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో తాను సమాచార శాఖలో 32 సం.ల సర్వీసులో సంతృప్తికరంగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు, పలువురు పాత్రికేయులు సుధాకర్ ను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ఓ ఈశ్వరమ్మ, ఎ పి ఆర్ ఓ గోపి, రిటైర్డ్ ఏవీఎస్ లు సుబ్రహ్మణ్యం కుమార్, మీడియా మిత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ అధికారులు, మీడియా మిత్రులు, వీడ్కోలు సన్మాన గ్రహీత వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *