విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ-సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.03.09.2024 మంగళవారం నాడు అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మరియు పామర్రు నియోజకవర్గం కురుమద్ధాలి లో గల రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డి.విక్టర్ బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఎస్.శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంయుక్తంగా తెలియజేసారు. ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా skilluniverse.apssdc.in లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 79955 34572 (అవనిగడ్డ), 80743 70846(కురుమద్దాలి) నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …